Bala Books

Bala Books 📚 BALA BOOKS PUBLICATIONS
In memory of Sri Late M.S.

Bhaskar ❤️
📖 From Chandamama to Shakespeare – we publish timeless classics, literary translations & original works in Telugu and beyond.
🌍 Translating Telugu ↔ World

బాలా బుక్స్ నుంచి ఒక ఆనందకరమైన విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాము. సైకాలజీ మీద తెచ్చిన "ఈడిపస్ కాంప్లెక్స్" పుస్తకానికి ఊహ...
07/04/2026

బాలా బుక్స్ నుంచి ఒక ఆనందకరమైన విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాము. సైకాలజీ మీద తెచ్చిన "ఈడిపస్ కాంప్లెక్స్" పుస్తకానికి ఊహించని స్పందన వచ్చింది. వచ్చిన ఆర్డర్స్ అన్నీ పోస్ట్ చేస్తూ పోయి చూసుకుంటే, ఫస్ట్ ఎడిషన్ కాపీలన్నీ ఖాళీ.... వచ్చిన ఆర్డర్స్‌లో కొన్ని ఆలస్యం కావటానికి ఇది కూడా ఒక కారణం. పుస్తకాలు అందటంలో జరిగిన ఆలస్యానికి పాఠకులకు క్షమాపణలు చెబుతూనే మీ ఆదరాభిమానాలు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాము. త్వరలోనే రీప్రింట్ కూడా వచ్చేస్తుంది.

దానితో పాటే మరో సంతోషం ఏమిటంటే ఈడిపస్ కాంప్లెక్స్ రచయిత ఫ్రొఫెసర్ బసవణ్ణగారి మిగతా పుస్తకాలని కూడా బాలాబుక్స్ నుంచి సిరీస్‌గా తేబోతున్నాం. తెలుగులో ఇలా సైకాలజీ మీద పుస్తకాల సెట్ గతంలో వచ్చిందా లేదా కచ్చితమైన సమాచారం లేదు. కానీ, ఇప్పుడు బాలాబుక్స్ ఆ ప్రయోగం చేబోతోంది.

మనల్ని మనం అర్థం చేసుకోవటానికి ప్రతీ వ్యక్తికీ అవగాహణలో ఉండవలసిన సైకాలజీ సమాచారాన్ని ఇచ్చే పుస్తకాలు అవసరం అనే అభిప్రాయంతోనే ఈ పనిలోకి దిగాం. రాబోయే సైకాలజీ సిరీస్‌లో ఒక్కొక్క పుస్తక సమాచారాన్నీ వీలుని బట్టి పరిచయం చేస్తాం...
ఈడిపస్‌కాంప్లెక్స్ పుస్తకం లాగానే కన్నడలో విశేష ప్రాచుర్యం పొందిన ఫ్రొఫెసర్ బసవణ్ణగారి పరిశోధన తెలుగు పాఠకులకు చేర్చాలనే ఈ ప్రయత్నం బాలాబుక్స్‌కి మాత్రమే కాదు తెలుగు పాఠకులకు కూడా సంతోషాన్నిస్తుందని ఆశిస్తూ...

- ఉషా ప్రత్యూష & టీమ్ బాలాబుక్స్

జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న ఎడబాటులే రేపటి పెద్ద కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తాయి. కష్టాలను తట్టుకోవడం ఒక మానసిక ...
31/03/2026

జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న ఎడబాటులే రేపటి పెద్ద కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తాయి.
కష్టాలను తట్టుకోవడం ఒక మానసిక సాధన! 💪
మనం మానసికంగా కుంగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

మానసిక దృఢత్వం గురించి, మనిషి అంతరంగాన్ని ఆవిష్కరించే అద్భుతమైన పుస్తకం - "ఇడిపస్ కాంప్లెక్స్".

మీరు మనస్తత్వ శాస్త్రం (Psychology) పుస్తకాలు చదవడానికి ఇష్టపడతారా? అయితే ఈ పుస్తకం మీకోసమే! 👇



















నిన్న హైదరాబాద్ సెంట్రల్ లైబ్రరీలో బాలాబుక్స్ & ఎన్నెలపిట్ట నిర్వహించిన పొయెట్రీ వర్క్‌షాప్‌లో కొన్ని దృశ్యాలు... దూరంగా...
29/03/2026

నిన్న హైదరాబాద్ సెంట్రల్ లైబ్రరీలో బాలాబుక్స్ & ఎన్నెలపిట్ట నిర్వహించిన పొయెట్రీ వర్క్‌షాప్‌లో కొన్ని దృశ్యాలు...
దూరంగా ఉండి ప్రోగ్రామ్ మిస్సాయానని బాధగా ఉన్నా... కవిత్వం రాసే పిల్లలు ఇంత మంది ఉన్నారని తెలిసి ఆశ్చర్యంగా అనిపించింది.
సభలో పిల్ల కవితలని విని, సూచనలు ఇచ్చి, వాళ్లకి అవసరమైన విషయాల మీద మాట్లాడిన కవి యాకూబ్‌గారూ, మెర్సీమార్గరెట్‌గారూ, చందు శివన్నగారికీ ధన్యవాదాలు..
ఇలాంటి ప్రయత్నాన్ని ప్రోత్సహించటానికి వెన్యూ ఏర్పాటు చేయటమే కాదు సభలో ప్రసంగించి, మా ప్రయత్నాన్ని మెచ్చుకుంటూ భుజం తట్టిన తెలంగాణా రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ రియాజ్‌గారికి కృతఙ్ఞతలు.
ప్రోగ్రామ్ విజయవంతం కావటానికి మాతో పని చేసిన హథిరామ్ సభావట్, బాలూ అగ్నివేశ్, శశిధర్‌ల గురించి ఎంత చెప్పినా తక్కువే...
వచ్చే సంవత్సరం జరగబోయే సభకోసం ఎదురు చూసేలా చేశారు.... త్వరలోనే అరవైమంది కొత్త తరం కవులూ, కవయిత్రుల కవిత్వంతో ఎన్నెలపిట్ట, బాలాబుక్స్ సంయుక్త ప్రచురణలో రాబోతోందని చెప్పటానికి ఆనందంగా ఉంది...

మీ పిల్లల ముందు మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు?పిల్లలు మీరు చెప్పే మాటలను వినకపోవచ్చు, కానీ మీరు చేసే ప్రతి పనిని గమనిస్తూన...
28/03/2026

మీ పిల్లల ముందు మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు?

పిల్లలు మీరు చెప్పే మాటలను వినకపోవచ్చు, కానీ మీరు చేసే ప్రతి పనిని గమనిస్తూనే ఉంటారు. గుర్తుంచుకోండి... మీ ప్రవర్తనే వారికి మొదటి పాఠం.

పిల్లలు పెద్దల ప్రవర్తనను బాగా గమనిస్తారు, వాటిని బట్టి తమలో కొన్ని లక్షణాలను పెంచుకుంటారు, కొన్నిటిని మార్చుకుంటారు . పిల్లల మానసిక ఎదుగుదలలో తల్లిదండ్రుల పెంపకం ఎంత కీలకమో వివరించే అద్భుతమైన పుస్తకం "ఇడిపస్ కాంప్లెక్స్"

సిగ్మండ్ ఫ్రాయ్డ్ వంటి మహామేధావుల సిద్ధాంతాలను సులభమైన తెలుగులో అందించే ఈ పుస్తకం ఇప్పుడు మీ కోసం! 👇📚

బాలా బుక్స్ నుండి మీ పుస్తకం పొందండి



















27/03/2026
"కవిత్వం రాయటం నేర్చుకుంటారా?" ఇది నాకెప్పుడూ అనుమానమే... కవిత్వం ప్రతీ మనిషిలోనూ ఉంటుంది. అది ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలన్న...
27/03/2026

"కవిత్వం రాయటం నేర్చుకుంటారా?" ఇది నాకెప్పుడూ అనుమానమే... కవిత్వం ప్రతీ మనిషిలోనూ ఉంటుంది. అది ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలన్నదే "కవిత" నిర్ణయిస్తుంది... ఇది నా కచ్చితమైన అభిప్రాయం.

కొత్తగా వస్తోన్న పిల్లలు రాస్తున్నది చూస్తూంటే ఒక్కోసారి ఆశ్చర్యంగా ఉంది. వీళ్లని ఎలా మిస్సవుతున్నానా అని, కొత్తగా రాయాలంటే వీళ్లనుంచి నేర్చుకొని తీరాల్సిందే. అందుకే! పిల్లలతో మాట్లాడటానికి ఈ వర్క్‌షాప్ ఒక మార్గం అనిపించింది. అన్నిటికంటే విచిత్రం ఏమిటంటే... నన్ను మాట్లాడమని ఇచ్చిన టాపిక్.
కవిత్వానికి దృక్పథం ఏమిటో, అది ఎందుకు, ఎలా అవసరమో వీళ్లతో మాట్లాడి తేల్చుకోవాలి...

మా బాస్ ఉషాప్రత్యూష Usha Prathyusha "మర్యాదగా" హెచ్చరించటం వల్ల ఈ పనికి ఒప్పుకోవాల్సి వచ్చిందేమో అని మీరనుకోవచ్చు. అలా ఏం లేదు, నాకు పూర్తి ఇష్టంతోనే ఈ వర్క్‌షాప్‌లో పాల్గొంటున్నాను... :)

బాలాబుక్స్ Bala Books, ఎన్నెల పిట్ట Ennelapitta books ఇద్దరూ కలిసి చేస్తున్న ఈ ప్రోగ్రామ్‌కి వెన్యూ ఇచ్చి సహకరించిన తెలంగాణా రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ రియాజ్‌గారికి కృతఙ్ఞతలతో...

నరేష్కుమార్ సూఫీ

28 మార్చ్ 2026
ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 వరకు....

"పిల్లల జీవితంలోని తొలి ఐదు సంవత్సరాల అనుభవం, వారి తరువాతి యాభై సంవత్సరాల మానసిక స్వభావాన్ని నిర్ణయిస్తుంది."పిల్లల పెంప...
24/03/2026

"పిల్లల జీవితంలోని తొలి ఐదు సంవత్సరాల అనుభవం, వారి తరువాతి యాభై సంవత్సరాల మానసిక స్వభావాన్ని నిర్ణయిస్తుంది."

పిల్లల పెంపకంలో మీరు చేస్తున్న పొరపాట్లు వారి భవిష్యత్తును ఎలా మారుస్తాయో మీకు తెలుసా?

ప్రతి బిడ్డ తన చుట్టూ ఉన్న వ్యక్తుల నుంచి తన స్వభావాన్ని అలవాటు చేసుకుంటాడు. మన ప్రవర్తన, మాటలు వారి వ్యక్తిత్వంపై శాశ్వత ముద్ర వేస్తాయి.

పిల్లల మానసిక వికాసం మరియు తల్లిదండ్రుల పాత్ర గురించి నిపుణులు అందించిన అద్భుతమైన విశ్లేషణలు ఇప్పుడు తెలుగులో.

మానవ మనస్తత్వశాస్త్రంలోని లోతైన రహస్యాలను సామాన్యులకు సైతం అర్థమయ్యేలా వివరించే పుస్తకం "ఇడిపస్ కాంప్లెక్స్"



















అతను కేవలం విసిరేసిన అగ్నిజ్వాల మాత్రమే కాదు... ఒక అచంచలమైన ఆలోచనా శక్తి!ఇవాళ భగత్ సింగ్ షహీద్ అయిన రోజు. 23 ఏళ్ల ప్రాయం...
23/03/2026

అతను కేవలం విసిరేసిన అగ్నిజ్వాల మాత్రమే కాదు... ఒక అచంచలమైన ఆలోచనా శక్తి!

ఇవాళ భగత్ సింగ్ షహీద్ అయిన రోజు. 23 ఏళ్ల ప్రాయంలోనే మరణాన్ని చిరునవ్వుతో ఆహ్వానించిన ఆ వీరుడి గురించి మనకు తెలుసు. కానీ, ఆయన చంకలో భగవద్గీత పట్టుకుని కోర్టుకు వెళ్లాడని, ఆయన్ని ఒక మతానికి అంటగట్టాలని చూస్తున్న ఈ కాలంలో... భగత్ సింగ్ అసలైన ‘ఆలోచన’ను తెలుసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది.

"నా పేరు భగత్ సింగ్" (నేను నాస్తికుణ్ణి ఎందుకయ్యానంటే..)
జైలు గోడల మధ్య, మరణశిక్షకు చేరువలో ఉండి కూడా ఏ కల్పిత శక్తి ముందు తలవంచని ఒక మేధావి రాసుకున్న నోట్స్ ఇవి.

ఈ పుస్తకంలోని కొన్ని శక్తివంతమైన మాటలు:

"నేను నాస్తికుణ్ణి. కాబట్టి నాకు స్వర్గం-నరకం అనే భయాలు లేవు. నేను నశించిపోతానని నాకు తెలుసు. అందుకే నేను ధైర్యంగా మరణాన్ని ఎదుర్కోగలను."

"మనిషి తెలియని విషయాలపై భయంతో దేవుణ్ణి సృష్టించుకున్నాడు. విజ్ఞానం, వివేకం ఉన్న చోట దేవుడు అవసరం లేదు."

భగత్ సింగ్ అంటే కేవలం తుపాకీ పట్టిన విప్లవకారుడు మాత్రమే కాదు; ఒక గొప్ప తాత్వికుడు, మానవతావాది. ఆయన కమ్యూనిస్ట్ భావజాలాన్ని, మతంపై ఆయనకున్న విమర్శనాత్మక దృష్టిని అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకం ఒక అద్భుతమైన మార్గదర్శి.

బాల బుక్స్ (Bala Books) ప్రచురించిన ఈ పుస్తకం ఇప్పుడు అందుబాటులో ఉంది.

📘 పుస్తకం: నా పేరు భగత్ సింగ్
✍️ అనువాదం : మోహన్ తలారి (Mohan Talari)
🏢 ప్రచురణ: బాల బుక్స్ (Bala Books)
💰 ధర: ₹250/- (+ ₹40/- పోస్టల్ చార్జీలు)

📲 మీ కాపీ కోసం ఇప్పుడే వాట్సాప్ చేయండి: 9573609460

ఆయన త్యాగాన్ని స్మరించుకుందాం.. ఆయన ఆలోచనలను పంచుకుందాం!

2026లో సరికొత్త రచయితలను పాఠకులకు పరిచయం చేయాలనే సంకల్పంతో 'బాలా బుక్స్' అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే మా రెండో సర్...
21/03/2026

2026లో సరికొత్త రచయితలను పాఠకులకు పరిచయం చేయాలనే సంకల్పంతో 'బాలా బుక్స్' అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే మా రెండో సర్ప్రైజ్ సిద్ధమైంది! క్రైమ్ థ్రిల్లర్ అభిమానులను అలరించేందుకు సయ్యద్ ఆయేషా సుల్తానా రాసిన 'మూన్ లైట్ కిల్లర్' నవలను త్వరలోనే మీ ముందుకు తీసుకువస్తున్నాం. కొత్త రచయితలను ప్రోత్సహించే మా ఈ ప్రయాణంలో తోడైన ఆయేషా గారికి బాలా బుక్స్ ఫ్యామిలీ తరపున హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాం.

"ఎదుటివారి ప్రవర్తన నచ్చలేదని దూరం పెట్టడం సులభం, కానీ అదే ప్రవర్తన వెనుక ఉన్న కారణాన్ని వెతకడం మానవత్వం." ✨🤝మనిషిని చూస...
21/03/2026

"ఎదుటివారి ప్రవర్తన నచ్చలేదని దూరం పెట్టడం సులభం, కానీ అదే ప్రవర్తన వెనుక ఉన్న కారణాన్ని వెతకడం మానవత్వం." ✨🤝
మనిషిని చూసి కాదు.. మనసుని చూసి అర్థం చేసుకుందాం! 🔍🧠
మనం చేసే ప్రతి పని వెనుక ఒక బలమైన మానసిక కారణం ఉంటుంది. ఎదుటివారి ప్రవర్తనకు గల మూలాలను తెలుసుకున్నప్పుడే నిజమైన మానవ సంబంధాలు బలపడతాయి. వ్యక్తిత్వ వికాసం మరియు మానవ మనస్తత్వశాస్త్రంపై సులభమైన తెలుగులో వచ్చిన అద్భుత గ్రంథం "ఇడిపస్ కాంప్లెక్స్".

📖 పుస్తకం: ఇడిపస్ కాంప్లెక్స్
✍️ రచయిత: డా. ఎం. బసవన్న

మీ ఆలోచనా దృక్పథాన్ని మార్చే పుస్తకం!



















Thank you Kandukuri Ramu garu on your attractive poster on balabooks
20/03/2026

Thank you Kandukuri Ramu garu on your attractive poster on balabooks

గత సంవత్సరం బాలాబుక్స్ నుంచి ఎక్కువగా క్లాసిక్స్, సీనియర్‌రైటర్స్ నుంచే ఎక్కువ బుక్స్ వచ్చాయి. అందుకే ఈసారి కొత్త రచయితల...
19/03/2026

గత సంవత్సరం బాలాబుక్స్ నుంచి ఎక్కువగా క్లాసిక్స్, సీనియర్‌రైటర్స్ నుంచే ఎక్కువ బుక్స్ వచ్చాయి. అందుకే ఈసారి కొత్త రచయితలని పరిచయం చేస్తే బాగుంటుందని అనుకున్నాం. ఆ వెతుకులాటలో భాగంగానే ఆదిలాబాద్ నుంచి ఈ నవల దొరికింది. మంచి ఫిక్షన్ రాయగల రచయితలు కొత్త తరంలో ఉన్నారన్న నమ్మకమూ వచ్చింది. తమ తొలినవలతోనే మాతో ప్రయాణం చేయటానికి వచ్చిన ఈ రచయితలని సగర్వంగా, గౌరవంగా మా పాఠకులముందుకు తీసుకువస్తున్నాం...
#కేరాఫ్‌వైఢూర్యపురం అనే ఈ ఫిక్షన్ నవలని రాసిన రమాకాంత్ బుక సాహిత్య ప్రపంచంలోకి బాలాబుక్స్ నుంచి ఆహ్వానిస్తున్నాం. ఈ సంవత్సరం బాలాబుక్స్ నుంచి ఇవ్వబోయే సర్‌ప్రైజ్‌లలో ఇది మొదటిది.

రమాకాంత్ బుక ...1994 లో తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో జన్మించారు. వీరు తన ప్రాథమిక విద్యను స్వగ్రామమైన వడూర్ (వదూర్) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్తి చేసి, బాసర ట్రిపుల్ ఐటి (ఈఈఈట్ భసర్) నుండి సివిల్ ఇంజనీరింగ్‌లో బి.టెక్ పట్టా పొందారు.

2016 నుండి తెలంగాణ ప్రభుత్వ 'మిషన్ భగీరథ' విభాగంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఆఏఏ)గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వృత్తిరీత్యా సాంకేతిక రంగంలో ఉన్నప్పటికీ, ప్రవృత్తిరీత్యా సాహిత్యంపై ఉన్న మక్కువతో కథా రచనలు చేస్తున్నారు.

Address

Bala Books Corner
Tirupati
517501

Alerts

Be the first to know and let us send you an email when Bala Books posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share