Srinivas Reddy true all in one channel

Srinivas Reddy true all in one channel Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Srinivas Reddy true all in one channel, Rajahmondry.

👇👇👇👇👇అమెరికా వాడైనా మన ఆవకాయని కాదనగలడా?మన పట్టు ధోతులలో పెళ్లికొడుకులా మారకపోడా..?మొన్నీమధ్య హైదరాబాద్ లో జరిగిన ISHK క...
06/05/2023

👇👇👇👇👇

అమెరికా వాడైనా మన ఆవకాయని కాదనగలడా?
మన పట్టు ధోతులలో పెళ్లికొడుకులా మారకపోడా..?

మొన్నీమధ్య హైదరాబాద్ లో జరిగిన ISHK కాన్ఫరెన్స్ లో
దేశ విదేశాల నుంచి surgeons తరలి వచ్చారు.
హైదరాబాద్ లో ఆ కాన్ఫరెన్స్ ని అంగరంగ వైభవంగా జరపడానికి
ప్రస్తుతం ISHK కి అధ్యక్ష బాధ్యతలను స్వీకరిస్తున్న నేను, నా బృందం కలిసి ఎంతో కృషి చేసాము.
నా అధ్యక్షతన జరిగిన ఈ అంతర్జాతీయ సదస్సులో
కాస్త తెలుగుదనాన్ని అంటిద్దామని
రెండు రోజులు జరిగిన ఆ కార్యక్రమంలో ఒక రోజు,
వచ్చిన సర్జన్ లు అందరికీ
పట్టు పంచెలు బహూకరించి, వాటి మీద డిన్నర్ కి ఆహ్వానించాను!
తెలుగు రుచి-సూచి నచ్చనిది ఎవరికి చెప్పండి?
ఇలా రకరకాల దేశాల నుంచి వచ్చిన ఎంతో మంది సర్జన్ లు
పట్టు పంచెలలో మెరిసి ఆ రాత్రికి అందాన్ని తెచ్చారు.
తెలుగుదనాన్ని వారి మీద మోసి, ఒక రాత్రికి అచ్చమైన తెలుగు వారయ్యారు..

27/09/2022
🙏🌺హైదరాబాద్ : చిలుకూరుశ్రీ చిలుకూరు బాలాజీ ఆలయం కోరిన వరాలిచ్చే చిలుకూరి బాలాజీ వేంకటేశ్వర స్వామి 🌺🙏🌺 ప్రత్యేక దర్శనాలు,...
25/06/2022

🙏🌺హైదరాబాద్ : చిలుకూరు
శ్రీ చిలుకూరు బాలాజీ ఆలయం కోరిన వరాలిచ్చే చిలుకూరి బాలాజీ వేంకటేశ్వర స్వామి 🌺🙏

🌺 ప్రత్యేక దర్శనాలు, అర్చన టిక్కెట్లు, హుండీల గొడవలు లేని ఆలయంగా చిలుకూరు బాలాజీ క్షేత్రం వినుతి కెక్కింది.

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మూడు చోట్ల ప్రత్యక్షమైనట్లు పురాణాలు చెబుతున్నాయి. తిరుమలలో వెలసిన శ్రీ వెంకటేశ్వరుడు, ద్వారకా తిరుమల మరొకటి తెలంగాణ లోని చిలుకూరు గా ప్రతీతి.

భాగ్యనగరంలోని చిలుకూరులో వెలసిన శ్రీవేంకటేశ్వరస్వామి కొరినదే తడవుగా కొండంత వరాలు అనుగ్రహించినప్పటికీ, భక్తుల వద్ద నుండి వడ్డి కాసులు మాత్రం ఆశించడు. 🌺

🌺 ఇటీవలికాలంలో ఇంతగా ప్రసిద్ధి చెందిన చిలుకూరు బాలాజీ టెంపుల్ నిజానికి ఇప్పటిది కాదు. ఉస్మాన్ సాగర్ తీరంలో ఉన్న ఈ చిలుకూరు చాలా పురాతనమైంది. చిలుకూరులో 10,12 శతాబ్దాల్లో రాష్ట్రకూటులు, కళ్యాణీ పశ్చిమ చాళుక్యుల ప్రత్యక్ష పాలనలో ఉండేదని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. రాజులు, సామంతులు, దండనాయకులు అప్పట్లో చిలుకూరును రాజధానిగా చేసుకుని పాలించినట్లు శాసనాలు లిఖించి ఉన్నాయి. అబుల్ హసన్ తానీషా మంత్రులు అక్కన్న, మాదన్నలు చిలుకూరు బాలాజీ టెంపుల్ ను దర్శించుకున్నారు. అంటే భద్రాచలం రామాలయం కంటే చిలుకూరు బాలాజీ టెంపుల్ పురాతనమైంది.🌺

🌺 స్థలపురాణం :

సుమారు 500 ఏళ్ల కిత్రం.. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి పరమభక్తుడైన గున్నాల మాధవరెడ్డి ఈ చిలుకూరులో ఉండేవాడు. అతను ఏటా ఎంత కష్టమైనా.. కాలినడకన తిరుపతి వెళ్లి.. స్వామివారిని దర్శించుకుని వచ్చేవాడు.
వృద్ధాప్యంలో సైతం ఆయన వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు కాలినడకన వెళ్లి వస్తుండేవాడు.

అలా ఒకసారి తిరుమలకు బయల్దేరిన మాధవరెడ్డి.. ప్రయాణ బడలిక కారణంగా మార్గమధ్యంలోనే సొమ్మసిల్లి పడిపోయాడు.
ఆ మగత నిద్రలో వచ్చిన కలలో అతనికి స్వామివారు ప్రత్యక్షమయ్యారు.
‘మాధవా.. ఇకపై నువ్వు నా దర్శనం కోసం ఇంతదూరం ప్రయాసపడి రావాల్సిన అవసరం లేదులే.
నేను చిలుకూరిలోని ఒక పుట్టలో కొలువై ఉన్నా.. వెలికి తీసి గుడి నిర్మించి ,నన్ను సేవించి తరించు’.. అని చెప్పి మాయమయ్యాడట!
నిద్ర నుంచి మేలుకున్న మాధవరెడ్డి ఈ విషయాన్ని గ్రామస్థులకు తెలిపారు.
అంతా కలిసివచ్చి.. అక్కడ ఉన్న పుట్టను గునపాలతో పెకిలిస్తుండగా.. గునపం బాలాజీ ఎదభాగంలో తగిలి రక్తం వచ్చింది. వెంటనే అపచారమైందంటూ అంతా ఆ దేవదేవుణ్ని క్షమాపణలు కోరి ఆపై విగ్రహాన్ని పాలతో కడిగి బయటకు తీశారు. అలా దొరికిన బాలాజీకి అక్కడే ఆలయాన్ని నిర్మించి.. పూజలు చేయడం ప్రారంభించారు. ఈ స్థలపురాణం నిజమేననడానికి ఇప్పటికీ ఆలయంలో కొలువైన బాలాజీ ఎదభాగంలో గునపం గుచ్చుకున్న ఆనవాళ్లు కనిపిస్తాయి.
అలా వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామి నిత్య పూజలందుకుంటు భక్తుల కొంగుబంగారంగా మారాడు.

ఇక్కడ ఏకశిలలోనే శ్రీదేవి, భూరేవి. వేంకటేశ్వరస్వామి ఉండటం ప్రత్యేకతగా చెప్పుకుంటారు. 🌺

🌺 చిలుకూరు స్వామి మహిమ అంతా ఇంతా కాదని ఆయన భక్తులు చెపుతారు. భక్తులు ముందుగా ఆలయంలో 11 ప్రదక్షిణలు చేసి, స్వామివారికి తమ కోరికను విన్నవించుకుంటారు. కోరిక తీరగానే 108 ప్రదక్షిణలు చేసి, స్వామివారిని దర్శించుకుని కృతజ్ఞతలు తెలుపుకుంటారు. భక్తుడు తన కోరిక సఫలమయ్యేవరకు ఆ కోరికను తనకు, స్వామివారికి మధ్యనే రహస్యంగా ఉంచాలి. మూడో మనిషి చెవిన వెయ్యకూడదు అట

ఇక్కడ దేవుని విగ్రహాన్ని కనులు మూసుకొకుండా చూడాలి అని చెబుతారు.

వీఐపీ దర్శనాలు, ప్రత్యేకపూజ టికెట్‌ వంటివేవీ లేవు. బాలాజీ దర్శనానికి ఎంతటి వారైనా సాధారణ భక్తుల మాదిరిగా క్యూలో వెళ్లాల్సిందే.
దేవుని వద్ద అంతా సమానమే. ఆలయంలో భక్తుడు చూడవలసింది దైవాన్ని మాత్రమే. భగవంతునికి భక్తునికి మధ్య డబ్బు వ్యవహారం అవసరం లేదనే పద్ధతిని చిలుకూరు ఆలయం పాటిస్తోంది.
ప్రజాభిప్రాయాన్ని, అర్చకుల అభిమతాన్ని గౌరవించి రాష్ట్రప్రభుత్వం స్వయంప్రతిపత్తినిచ్చింది.🌺

🌺 శ్రీరామనవమి తరువాతి రోజు అంటే చైత్ర మాసంలో పుష్యమి నక్షత్రంతో ఆరంభించి వారం రోజులపాటు పంచాహ్నిక దీక్షతో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి.
రోజూ వాహన సేవలుంటాయి. చక్రతీర్థంతో బ్రహ్మోత్సవాలు సమాప్తమవుతాయి.

1963లో రాజ్యలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించారు. అమ్మవారు మూడు చేతులలో పద్మాలు ధరించి ఉంటారు. నాలుగవ చేయి భక్తులను శరణాగతులను కమ్మని చూపుతూ ఉంటుంది.

చిలుకూరు స్వామిని వీసాల బాలాజీ అని కూడా పిలుస్తారు. అందువల్ల యువతకు ఆరాధ్య క్షేత్రమయ్యింది.
ఓం నమో వెంకటేశాయ నమః🌺

https://youtu.be/OjtmA60hL-sపైన చూపించిన లింక్ ని క్లిక్ చేసి పూర్తి వీడియో చూడండి
15/03/2021

https://youtu.be/OjtmA60hL-s
పైన చూపించిన లింక్ ని క్లిక్ చేసి పూర్తి వీడియో చూడండి

https://youtu.be/vC4vObXUNBAపైన చూపించిన లింక్ ని క్లిక్ చేసి పూర్తి వీడియో చూడండి
25/02/2021

https://youtu.be/vC4vObXUNBA
పైన చూపించిన లింక్ ని క్లిక్ చేసి పూర్తి వీడియో చూడండి

Address

Rajahmondry

Website

Alerts

Be the first to know and let us send you an email when Srinivas Reddy true all in one channel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share