UmaBhakti Pdf Files

UmaBhakti Pdf Files

22/07/2023
24/04/2023

*మనసుని తాకే ఈకథను తప్పకుండా చదవండి my dear ఫ్రెండ్స్!!

*SSC వరకు కలిసి చదువుకున్న *నలుగురు మిత్రులు*

*SSC ఎగ్జామ్ అయ్యాక హోటల్ కి వెళ్లి టీ, బ్రేక్ ఫాస్ట్ చేద్దాం అని నిర్ణయించుకున్నారు. .*

*అది ఆదివారం, సైకిల్ మీద హోటల్ చేరుకున్నారు.*

*టీ, అల్పాహారం చేస్తూ దినేష్, సంతోష్, మనీష్, ప్రవీణ్ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు..*

*యాభై ఏళ్ల తర్వాత మళ్లీ ఇదే తేదీన ఏప్రిల్ 04 న ఈ హోటల్‌లో కలుద్దామని నలుగురూ ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారు..*

*అప్పటి వరకు మనమందరం చాలా కష్టపడాలి, మంచి స్థాయికి రావాలి*

*అప్పటి వరకు ఆ నలుగురు స్నేహితులకు టీ, బ్రేక్‌ఫాస్ట్‌ అందించిన వెయిటర్‌ రాజు ఇదంతా విని,*
*sir*
*నేనూ ఇక్కడే ఉంటే గనక మీ అందరి కోసం ఈ హోటల్‌లో వేచి ఉంటాను అన్నాడు*

*నలుగురూ తదుపరి విద్య కోసం విడిపోయారు...!*

*రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి..*

*యాభై ఏళ్లలో ఆ నగరంలో సమూల మార్పులు వచ్చాయి, నగర జనాభా పెరిగింది, రోడ్లు, ఫ్లై ఓవర్లు, మెట్రోలు నగర రూపురేఖలే మారిపోయాయి*

*ఇప్పుడు ఆ హోటల్‌ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌గా మారిపోయింది, వెయిటర్‌ రాజు ఇప్పుడు ఆ హోటల్‌కే యజమాని అయ్యాడు..*

*యాభై ఏళ్ల తర్వాత, నిర్ణీత తేదీ ఏప్రిల్ 04 మధ్యాహ్నం, హోటల్ డోర్ వద్దకు విలాసవంతమైన కారు వచ్చి ఆగింది..*

*దినేష్ ఆ కారు దిగి వరండా వైపు నడవడం మొదలుపెట్టాడు, దినేష్ కి ఇప్పుడు మూడు జ్యువెలరీ షోరూంలు ఉన్నాయి..*

*ప్రవీణ్ సర్ మీ కోసం ఒక నెల క్రితమే టేబుల్ బుక్ చేసారని రాజు చెప్పాడు..*

*ఒక గంటలో సంతోష్ వచ్చాడు, సంతోష్ ఆ నగరంలో పెద్ద బిల్డర్ అయ్యాడు..*

*దినేష్, సంతోష్ ఇద్దరూ మాట్లాడుకుంటూ వేరే స్నేహితుల కోసం ఎదురుచూస్తుంటే, మూడో స్నేహితుడు మనీష్ అరగంటలో వచ్చి వారితో కలిసాడు..*

*అతనితో మాట్లాడిన తర్వాత మనీష్ వ్యాపారవేత్త అయ్యాడని దినేష్, సంతోష్ కి తెలిసింది.*

*స్నేహితులు ముగ్గురి చూపులు పదే పదే డోర్ వైపే వెళ్తున్నాయి, ప్రవీణ్ ఎప్పుడు వస్తాడా అని.?*

*ముగ్గురూ యాభై ఏళ్ల తర్వాత ఒకరినొకరు కలుసుకోవడం ఆనందంగా ఉంది*..

*గంటల తరబడి వారి సంభాషణ సాగినా ప్రవీణ్ రాలేదు..🤦*

*బిల్లు అడిగిన వెంటనే ఆన్‌లైన్‌లో బిల్లు కట్టినట్లు ముగ్గురికి సమాధానం వచ్చింది..*

*సాయంత్రం ఎనిమిది గంటల సమయంలో ఓ యువకుడు కారు దిగి,బయలుదేరేందుకు సిద్ధమవుతున్న ముగ్గురు స్నేహితుల వద్దకు వచ్చాడు, ముగ్గురూ ఆ వ్యక్తిని చూస్

🙋
09/08/2021

🙋

16/10/2017

*_ॐ_* *ఆచారాలు -అంతరార్థం *_ॐ_*

*ఆల‌యాల్లో గంట‌లు ఉండ‌డం…*

ఆల‌యాల్లో ఉండే గంట‌ను ఏడు సార్లు కొడితే మ‌న శ‌రీరంలో ఉన్న ఏడు చ‌క్రాలు ఉత్తేజం అవుతాయ‌ట‌. అంతేకాదు మెద‌డు కుడి, ఎడ‌మ భాగాలు రెండూ కొంత సేపు ఏక‌మ‌వుతాయ‌ట‌. దీంతోమ‌న మ‌న‌స్సుకు ప్ర‌శాంత‌త క‌లుగుతుంద‌ట‌. ఏకాగ్ర‌త పెరుగుతుంద‌ట‌. గంట‌ను మోగించ‌డం వ‌ల్ల ఆ ప్రాంతంలోని గాలిలో ఉండే క్రిములు నాశ‌న‌మ‌వుతాయ‌ట‌.

🍊 *ఆడ‌వారు గాజులు ధరించ‌డం వెనుక‌…*

ఆ గాజుల వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయ‌ట‌. గాజులు ఎల్ల‌ప్పుడూ చేతి న‌రాల‌కు తాకుతూ ఉండ‌డం వ‌ల్ల బీపీ కూడా కంట్రోల్‌లో ఉంటుంద‌ట‌.

🍄 *పిల్ల‌ల‌కు చెవులు కుట్టించ‌డం…*

చిన్నారుల‌కు చెవులు కుట్టించ‌డం స‌హ‌జ‌మే. ప్ర‌ధానంగా ఆడ‌పిల్ల‌ల‌కు, ఆ మాట‌కొస్తే కొంత మంది మ‌గ పిల్ల‌ల‌కు కూడా చెవులు కుట్టిస్తారు. అయితే ఇలా కుట్టించ‌డం వ‌ల్ల ఆక్యుప్రెష‌ర్ వైద్యం జ‌రిగి దాంతో వారికి వ‌చ్చే అనారోగ్యాలు పోతాయ‌ట‌. ప్ర‌ధానంగా ఆస్త‌మా వంటి వ్యాధులు రావ‌ట‌.

🍄 *రావి చెట్టును పూజించ‌డం…*

హిందువుల్లో అధిక శాతం మంది రావి చెట్టుకు పూజ‌లు చేస్తారు. ఈ చెట్ల‌యితే ఎక్కువ‌గా దేవాల‌యాల్లోనే ఉంటాయి. అయితే సాధార‌ణంగా చెట్ల‌న్నీ ప‌గ‌టి పూట ఆక్సిజ‌న్‌ను విడుద‌ల చేస్తే ఈ చెట్టు మాత్రం రాత్రి పూట ఆక్సిజ‌న్‌ను విడుద‌ల చేస్తుంద‌ట‌. దీంతోనే రావి చెట్టును పూజిస్తారు.

🍅 *కాలి వేళ్ల‌కు మెట్టెలు ధ‌రించ‌డం…*

హిందూ సాంప్ర‌దాయంలో పెళ్ల‌యిన మ‌హిళ‌లు కాలికి మెట్టెల‌ను ధ‌రిస్తారు. ఇలా ధ‌రించ‌డం వ‌ల్ల ఆక్యుప్రెష‌ర్ వైద్యం జ‌రిగి వారి గుండె నుంచి గ‌ర్భాశ‌యానికి ర‌క్త ప్ర‌స‌ర‌ణ బాగా జ‌రుగుతుంద‌ట‌. అయితే వెండి మెట్టెలు ధ‌రిస్తే ప్ర‌కృతిలో ఉన్న పాజిటివ్ ఎన‌ర్జీ వారి శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తుంద‌ట‌.

🌹 *నిద్రించేట‌ప్పుడు త‌ల‌ను ఉత్త‌రానికి పెట్ట‌క‌పోవ‌డం.*

భూమికి అయ‌స్కాంత క్షేత్రం ఉన్న‌ట్టుగానే మ‌న శ‌రీరానికి కూడా అయ‌స్కాంత క్షేత్రం ఉంటుంద‌ట‌. ఒక వేళ మ‌నం ఉత్త‌రం దిశ‌గా త‌ల‌ను పెట్టి ప‌డుకుంటే మ‌న శ‌రీరంలో ఉన్న ఐర‌న్ మెద‌డుకు ప్ర‌వ‌హించి బీపీ, గుండె సంబంధ స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌. త‌ల‌నొప్పి, అల్జీమ‌ర్స్‌, పార్కిన్‌స‌న్స్ డిసీజ్ వంటి వ్యాధులు వ‌స్తాయ‌ట‌. కాబ‌ట్టి త‌ల‌ను ఉత్త‌రం దిశ‌కు పెట్టి నిద్రించ‌కూడ‌ద‌ట‌.

🌸 *నుదుట‌న కుంకుమ బొట్టు ధ‌రించ‌డం…*

నుదుట‌న కుంకుమ బొట్టును ధ‌రిస్తే అక్క‌డి న‌రాలు ఉత్తేజిత‌మై పీయూష గ్రంథిని యాక్టివేట్ చేస్తాయ‌ట‌. దీంతో బీపీ, ఒత్తిడి, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుముఖం ప‌డ‌తాయ‌ట‌.

💐 *ఎదుటి వారికి రెండు చేతులతో న‌మ‌స్క‌రించ‌డం...*

ఎదురుగా ఉన్న వారికి రెండు చేతుల‌తో న‌మ‌స్క‌రిస్తే మ‌నం వారిని ఎప్ప‌టికీ గుర్తు పెట్టుకుంటామ‌ట‌. ఎలాగంటే రెండు చేతుల‌ను జోడించిన‌ప్పుడు చేతి వేళ్ల‌న్నీ క‌లిసిపోయి ఆక్యుప్రెష‌ర్ వైద్యం జ‌రిగి మ‌న జ్ఞాప‌క‌శ‌క్తిని పెంచుతాయ‌ట‌. దీంతోపాటు మెద‌డు ప‌నితీరు కూడా మెరుగు ప‌డుతుంద‌ట‌.

🌺 *నేల‌పై కూర్చుని భోజ‌నం చేయ‌డం…*

నేల‌పై కూర్చుని భోజ‌నం చేయ‌డం వ‌ల్ల ప‌ద్మాస‌నం భంగిమ వ‌స్తుంది. దీంతో జీర్ణ‌క్రియ స‌క్ర‌మంగా జ‌రిగి జీర్ణాశ‌య సంబంధ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయ‌ట‌.

కార‌మైన ఆహారం ముందు, స్వీట్లు త‌రువాత తిన‌డం…

భోజ‌నం చేసిన‌ప్పుడు ముందుగా కారంగా ఉండే ఆహారం తిన‌డం వ‌ల్ల జీర్ణాశ‌యంలో జీర్ణ‌క్రియ‌కు అవ‌స‌ర‌మైన ఆమ్లాలు బాగా ఉత్ప‌త్తి అవుతాయ‌ట‌. దీంతో జీర్ణ‌క్రియ స‌క్ర‌మంగా జ‌రుగుతుంద‌ట‌. అయితే భోజ‌నం మొదట్లోనే స్వీట్లు తింటే అది మ‌నం తిన్న ఆహారాన్ని స‌రిగ్గా జీర్ణంచేయ‌నీయ‌ద‌ట‌.

🍀 *న‌దుల్లో నాణేలు వేయ‌డం…*

ఒక‌ప్పుడు మ‌న ద‌గ్గ‌ర రాగితో చేసిన నాణేలు చ‌లామ‌ణీలో ఉండేవి. ఈ కార‌ణంగా ఆ నాణేల‌ను న‌దుల్లో వేస్తే ఆ రాగి అంతా ఆ నీటిని శుద్ధి చేసేద‌ట‌. దీంతో ఆ నీటిని తాగేవారికి ఎన్నో అనారోగ్యాలు దూర‌మ‌య్యేవ‌ట‌.

🌻 *ఉప‌వాసం ఉండ‌డం…*

హిందువుల్లో అధిక శాతం మంది వారంలో ఏదో ఒక రోజు దేవుడికి ఉప‌వాసం ఉంటారు క‌దా.ఆయుర్వేద ప్ర‌కారం అలా ఉప‌వాసం ఉండ‌డం చాలా మంచిది. ఎందుకంటే ఉప‌వాస స‌మ‌యంలో మ‌న జీర్ణ‌వ్య‌వ‌స్థకు పూర్తిగా విశ్రాంతి ల‌భించి శ‌రీరంలో ఉన్న ప‌లు విష ప‌దార్థాలు బ‌య‌ట‌కు వెళ్ల‌గొట్ట‌ బ‌డ‌తాయ‌ట‌. దీంతోపాటు దేహం త‌న‌కు తాను మ‌ర‌మ్మ‌త్తులు చేసుకుంటుంద‌ట‌. ఉప‌వాసం ఉండ‌డం వ‌ల్ల డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు, క్యాన్స‌ర్‌, బాక్టీరియా ఇన్‌ఫెక్ష‌న్లు రావ‌ట‌!!!

*సనాతన హిందూ ధర్మము*✍

02/10/2017

మీరు ఏ సంవ‌త్స‌రంలో పుట్టారు... అంటే ఠ‌క్కున చెప్పేస్తారు. కానీ, ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారు అంటే చెప్ప‌లేం. అందుకే మీ కోసం ఆ తెలుగు వ‌త్స‌రాలు ఇస్తున్నాం. మీరు ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారో తెలుసుకోండి.

( 1867, 1927,1987,) ప్రభవ
(1868,1928,1988) విభవ
(1869,1929,1989) శుక్ల
(1870,1930,1990)ప్రమోదూత
(1871,1931,1991)ప్రజోత్పత్తి
(1872,1932,1992)అంగీరస
(1873,1933,1993)శ్రీముఖ
(1874,1934,1994)భావ
(1875,1935,1995)యువ
(1876,1936,1996)ధాత
(1877,1937,1997) ఈశ్వర
(1878,1938,1998)బహుధాన్య
(1879,1939,1999)ప్రమాది
(1880,1940,2000)విక్రమ
(1881,1941,2001)వృష
(1882,1942,2002)చిత్రభాను
(1883,1943,2003)స్వభాను
(1884,1944,2004)తారణ
(1885,1945,2005)పార్థివ
(1886,1946,2006)వ్యయ
(1887,1947,2007)సర్వజిత్
(1888,1948,2008)సర్వదారి
(1889,1949,2009)విరోది
(1890,1950,2010)వికృతి
(1891,1951,2011)ఖర
(1892,1952,2012)...నందన
(1893,1953,2013)...విజయ
(1894,1954,2014)...జయ
(1895,1955,2015)...మన్మద
(1896,1956,2016)...దుర్ముఖి
(1897,1957,2017)...హేవిళంబి
(1898,1958,2018)...విళంబి
(1899,1959,2019)...వికారి
(1900,1960,2020)...శార్వరి
(1901,1961,2021)...ప్లవ
(1902,1962,2022)...శుభకృత్
(1903,1963,2023)...శోభకృత్
(1904,1964,2024)...క్రోది
(1905,1965,2025)...విశ్వావసు
(1906,1966,2026)...పరాభవ
(1907,1967,2027)...ప్లవంగ
(1908,1968,2028)...కీలక
(1909,1969,2029)...సౌమ్య
(1910,1970,2030)...సాదారణ
(1911,1971,2031)...విరోదికృత్
(1912,1972,2032)...పరీదావి
(1913,1973,2033)...ప్రమాది
(1914,1974,2034)...ఆనంద
(1915,1975,2035)...రాక్షస
(1916,1976,2036)...నల
(1917,1977,2037)...పింగళ
(1918,1978,2038)...కాళయుక్తి
(1919,1979,2039)...సిద్దార్థి
(1920,1980,2040)...రౌద్రి
(1921,1981,2041)...దుర్మతి
(1922,1982,2042)...దుందుభి
(1923,1983,2043)...రుదిరోద్గారి
(1924,1984,2044)...రక్తాక్షి
(1925,1985,2045)...క్రోదన
(1926,1986,2046)...అక్షయ

Address

Parvathipuram

Telephone

9491762143

Website

Alerts

Be the first to know and let us send you an email when UmaBhakti Pdf Files posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category